మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభ ముందుకు తీసుకుని వచ్చింది. మంగళవారం నాడు రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో కేంద్రం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. ఆ బిల్లును స్వాగతిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వటానికి గర్విస్తున్నానని సీఎం జగన్ అన్నారు. మాకు అత్యంత ప్రాధాన్యత అంశం మహిళా సాధికారత అని.. గత నాలుగేళ్లుగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, సమాన ప్రాతినిధ్యం ద్వారా మహిళా సాధికారత సాధించామని చెప్పుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.