రేపు మంగ‌ళ‌గిరి, పత్తికొండలో ప‌ర్య‌టించ‌నున్న సీఎం జగన్‌

CM Jagan will visit Mangalagiri and Pattikonda tomorrow. రేపు గుంటూరు జిల్లా మంగళగిరి, కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు.

By Medi Samrat
Published on : 31 May 2023 8:07 PM IST

రేపు మంగ‌ళ‌గిరి, పత్తికొండలో ప‌ర్య‌టించ‌నున్న సీఎం జగన్‌

రేపు గుంటూరు జిల్లా మంగళగిరి, కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. మంగళగిరి సీ కే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న పేర్నాటి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్‌ వివాహానికి సీఎం జ‌గ‌న్ హాజరుకానున్నారు. అనంతరం కర్నూలు జిల్లా పత్తికొండలో వరుసగా ఐదో ఏడాది– మొదటి విడతగా వైయస్సార్‌ రైతుభరోసా– పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం నగదు జమ చేయనున్నారు. ఈ మేర‌కు అధికారులు షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

గురువారం ఉదయం 7.30 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకుంటారు. మంగళగిరిలోని సీ కే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న పేర్నాటి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్‌ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడ నుంచి గన్నవరం చేరుకుని.. కర్నూలు జిల్లాకు బయులుదేరుతారు.


Next Story