రేపు సీఎం జ‌గ‌న్ క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌

సీఎం వైఎస్‌ జగన్‌ రేపు వైఎస్‌ఆర్‌ జిల్లా పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on  1 Sept 2023 7:20 PM IST
రేపు సీఎం జ‌గ‌న్ క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌

సీఎం వైఎస్‌ జగన్‌ రేపు వైఎస్‌ఆర్‌ జిల్లా పర్యటనకు వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఉదయం 9 గంటలకు సీఎం జ‌గ‌న్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం జ‌గ‌న్‌.

Next Story