వైసీపీ కీలక సమావేశం.. అందుకేనా..?

ఏపీలో ఎన్నికల హడావుడి నెలకొంది. వైసీపీ-టీడీపీ అధిష్టానం తమ పార్టీ అభ్యర్థులకు బీ ఫారమ్ లను ఇస్తూ ఉంది.

By Medi Samrat  Published on  21 April 2024 4:55 PM IST
వైసీపీ కీలక సమావేశం.. అందుకేనా..?

ఏపీలో ఎన్నికల హడావుడి నెలకొంది. వైసీపీ-టీడీపీ అధిష్టానం తమ పార్టీ అభ్యర్థులకు బీ ఫారమ్ లను ఇస్తూ ఉంది. ఇక టీడీపీ కూటమి సూపర్ సిక్స్ అంటూ జనంలోకి వెళుతూ ఉంది. అయితే ఏపీ ప్రజలు వైసీపీ తీసుకుని వచ్చే మేనిఫెస్టో విషయంలో ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 99శాతం చేశామని వైసీపీ చెబుతూ ఉంది. చాలా కుటుంబాలు ఈ విషయంలో ఇప్పటికే లాభపడ్డాయి. ఇక ఓటింగ్ కు ఒక నెల కూడా సమయం లేకపోవడంతో వైసీపీ ఇక మేనిఫెస్టో అస్త్రాన్ని ప్రవేశపెట్టబోతోంది.

వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలకు సంబంధించి తుది కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం విశాఖలో బస్సు యాత్ర చేస్తు్న్న సీఎం జగన్ సోమవారం నాడు పార్టీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఆ భేటీలో మేనిఫెస్టోను సీఎం జగన్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 26 లేదా 27న మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి హామీలను ఇస్తారోనని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. చెప్పామంటే చేస్తామంతే అంటూ జనంలోకి వైసీపీ వెళ్లబోతోంది.

Next Story