రేపు సీఎం జగన్‌ విజయవాడ పర్యటన.. నవంబర్‌ 1న కూడా..!

రేపు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్యటించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా

By Medi Samrat  Published on  29 Oct 2023 3:11 PM GMT
రేపు సీఎం జగన్‌ విజయవాడ పర్యటన.. నవంబర్‌ 1న కూడా..!

రేపు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్యటించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ నరేందర్‌ ప్రమాణ స్వీకారోత్స‌వ‌ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ మేర‌కు అధికారులు ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. రేపు సాయంత్రం 4.47 గంటలకు సీఎం జ‌గ‌న్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాజ్‌భవన్‌ చేరుకుంటారు. అక్కడ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్న జస్టిస్‌ జి. నరేందర్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

నవంబర్‌ 1న కూడా సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ‌లో జ‌రిగే వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు పాల్గొననున్నారు. ఉదయం 10.48 గంటలకు సీఎం జ‌గ‌న్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ ఎ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుంటారు, అక్కడ జరగనున్న వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం సీఎం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Next Story