20న సీఎం జగన్ బిజీబిజీ.. ఒకే రోజు రెండు జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌

CM Jagan Visits To Districts On 20th. పిబ్ర‌వ‌రి 20న ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on  18 Feb 2022 7:40 PM IST
20న సీఎం జగన్ బిజీబిజీ.. ఒకే రోజు రెండు జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌

పిబ్ర‌వ‌రి 20న ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ఒకే రోజు క‌డ‌ప‌, విశాఖ‌ప‌ట్నం జిల్లాల‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ముందుగా 20వ తేదీ ఉదయం 11 గంటలకు సీఎం జ‌గ‌న్‌ కడప చేరుకోనున్నారు. అక్క‌డ‌ పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్‌ట్యూట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత కడప రింగ్‌ రోడ్‌ జయరాజ్‌ గార్డెన్స్‌లో డిప్యూటీ సీఎం ఎస్‌బి. అంజాద్‌ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.

ఆ తర్వాత అక్క‌డి నుండి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌. అదే రోజు సాయంత్రం 4.45 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి నేవల్‌ ఎయిర్‌స్టేషన్, ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలుకుతారు. కార్య‌క్ర‌మం అనంత‌రం జ‌గ‌న్‌ రాత్రి 7 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


Next Story