రేపు శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం జ‌గ‌న్‌ పర్యటన

CM Jagan Visits Sri Satyasai District Tomorrow. 2021 ఖరీఫ్‌కు సంబంధించిన పంటల బీమా పరిహారంను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న

By Medi Samrat  Published on  13 Jun 2022 1:30 PM IST
రేపు శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం జ‌గ‌న్‌ పర్యటన

2021 ఖరీఫ్‌కు సంబంధించిన పంటల బీమా పరిహారంను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని మంగ‌ళ‌వారం సీఎం జ‌గ‌న్ ప్రారంభించనున్నారు. మంగ‌ళ‌వారం శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటన సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మాన్ని సీఎం జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు. ఉదయం 09.00 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరుతారు. 10.50 గంటలకు చెన్నేకొత్తపల్లి చేరుకుంటారు. అక్క‌డ‌ 11.15 – 12.45 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని రైతులతో ముఖాముఖి భేటీ అవుతారు. అనంతరం స‌భ‌లో ప్రసంగిస్తారు. తర్వాత పంటల బీమా మెగా చెక్‌ను రైతులకు అందజేసి మధ్యాహ్నం 1 గంటకు తిరిగి పయనమై.. 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.








Next Story