రేపు సీఎం జగన్‌ పల్నాడు జిల్లా వినుకొండ పర్యటన

CM Jagan Visits Palnadu For Tomorrow. సీఎం వైఎస్‌ జగన్ సోమవారం పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించ‌నున్నారు.

By Medi Samrat  Published on  29 Jan 2023 3:11 PM IST
రేపు సీఎం జగన్‌ పల్నాడు జిల్లా వినుకొండ పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ సోమవారం పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జ‌గ‌న్‌. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు వినుకొండ చేరుకుంటారు. అక్క‌డ 11.05 గంట‌ల నుంచి 12.20 గంట‌ల వ‌ర‌కు వినుకొండ వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొంటారు. కార్య‌క్ర‌మంలో భాగంగా జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు వినుకొండ నుంచి బయలుదేరి 1.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


Next Story