రేపు విశాఖకు సీఎం వైఎస్‌ జగన్‌

CM Jagan Visits For Vizag Tomorrow. సీఎం వైఎస్‌ జగన్‌ రేపు విశాఖపట్టణం వెళ్ళనున్నారు. సాయంత్రం 4.00 గంటలకు

By Medi Samrat  Published on  22 Oct 2021 6:50 PM IST
రేపు విశాఖకు సీఎం వైఎస్‌ జగన్‌

సీఎం వైఎస్‌ జగన్‌ రేపు విశాఖపట్టణం వెళ్ళనున్నారు. సాయంత్రం 4.00 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి 5.20 గంటలకు ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఫ్లైఓవర్‌తో పాటు.. వీఎంఆర్‌డీఏ పూర్తిచేసిన 6 ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. అక్కడి నుండి బయలుదేరి 5.55 గంటలకు వుడా పార్క్‌కు చేరుకుంటారు.. అక్కడ వుడా పార్క్‌తో పాటు జీవీఎంసీ పూర్తిచేసిన 4 స్మార్ట్‌ ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తారు. తరువాత ఎంజీఎం పార్క్‌లో జరగనున్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరై వధూవరుల్ని ఆశీర్వదించనున్నారు. అనంతరం రాత్రి 7.10 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరిగి బయలుదేరి.. తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.


Next Story