రేపు సీఎం జగన్‌ విశాఖపట్నం, గుంటూరు జిల్లాల పర్యటన

CM Jagan Visits For Vishakapatnam Tomorrow. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రి జంక్షన్‌ వద్ద నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు

By Medi Samrat
Published on : 13 Dec 2022 5:34 PM IST

రేపు సీఎం జగన్‌ విశాఖపట్నం, గుంటూరు జిల్లాల పర్యటన

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రి జంక్షన్‌ వద్ద నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు సీఎం జ‌గ‌న్‌ హాజరుకానున్నారు. అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరు కానున్నారు సీఎం జ‌గ‌న్‌.

మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4 గంటలకు దాకమర్రి చేరుకుని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరవుతారు. అనంత‌రం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


Next Story