28న సీఎం జ‌గ‌న్ విశాఖ ప‌ర్య‌ట‌న‌

CM Jagan Visits For Visakhapatnam On 28th April. ఈ నెల 28న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం పర్యటనకు రానున్నారు

By Medi Samrat
Published on : 23 April 2022 1:14 PM IST

28న సీఎం జ‌గ‌న్ విశాఖ ప‌ర్య‌ట‌న‌

ఈ నెల 28న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రెండు జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం గ్రామంలో సీఎం ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నారు.

ఆవరణలో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. సభా వేదిక వద్ద తాగునీరు, మజ్జిగ, అన్ని రకాల మందులు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని వృద్ధులను సభకు తీసుకురావద్దని, ఆవరణలోకి అనుమతించవద్దని మల్లికార్జున స్పష్టం చేశారు. ప్రతి సచివాలయంలోని సిబ్బంది, వాలంటీర్లకు దీనిపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశానికి హాజరు కాకపోయినా అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తామని తెలిపారు. లబ్ధిదారుల సౌకర్యార్థం ఆవరణలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Next Story