రేపు సీఎం జగన్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటన

CM Jagan Visits For Srikakulam Tomorrow. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయస్‌ జగన్ రేపు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్ల‌నున్నారు

By Medi Samrat  Published on  26 Jun 2022 7:05 PM IST
రేపు సీఎం జగన్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటన

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయస్‌ జగన్ రేపు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో బాగంగా వరసగా మూడో ఏడాది జగనన్న అమ్మ ఒడి పథకాన్ని శ్రీకాకుళంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఉదయం 08.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి.. 10.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. అక్క‌డి నుండి 11 గంటలకు శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అమ్మ ఒడి పథకం లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు అక్కడి నుంచి తిరుగు పయనమై.. 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.







Next Story