నంద్యాలకు ముఖ్యమంత్రి జగన్

CM Jagan Visits For Nandyala Tomorrow. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు.

By Medi Samrat  Published on  16 Oct 2022 5:30 PM IST
నంద్యాలకు ముఖ్యమంత్రి జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఆళ్లగడ్డలో జరిగే వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ రెండో విడత నిధుల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయ అధికారులు విడుదల చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి సీఎం జగన్ నంద్యాల జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. ఉదయం 10:15 గంటలకు ఆయన ఆళ్లగడ్డ చేరుకుంటారు. ఉదయం 10:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:10 గంటల వరకు వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ రెండో విడత నగదు బదిలీ నిధులను బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు. మధ్యాహ్నం 12:35 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


Next Story