జూన్ 5న గుంటూరులో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

CM Jagan Visits For Guntur On June 5th. జూన్ 5వ తేదీన సీఎం వైయస్ జగన్ గుంటూరులో పర్యటించనున్నారు.

By Medi Samrat
Published on : 31 May 2022 8:30 PM IST

జూన్ 5న గుంటూరులో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

జూన్ 5వ తేదీన సీఎం వైయస్ జగన్ గుంటూరులో పర్యటించనున్నారు. వ్యవసాయదారులకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం గుంటూరులో జరగనుంది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో మంగళవారం అధికారులు పర్యటించారు. ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, ఎం. ఎల్.సి లేళ్ళ అప్పిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హరి కిరణ్, జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి తదితరులు గుంటూరులో పరిశీలించారు. ఈకార్యక్ర మంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు, నగర పాలక సంస్థ అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అదే రోజు సీఎం జగన్ జిందాల్ కంపెనీని ప్రారంభించనున్నారు.








Next Story