26న సీఎం జ‌గ‌న్‌ గుంటూరు జిల్లా పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ ఈ నెల 26న గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on  24 Dec 2023 12:13 PM GMT
26న సీఎం జ‌గ‌న్‌ గుంటూరు జిల్లా పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ ఈ నెల 26న గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. 26వ తేదీ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి నల్లపాడు చేరుకుంటారు. అక్కడ లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Next Story