రేపు అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan visit to Annamaiya district tomorrow. రేపు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్య‌టించ‌నున్నారు.

By Medi Samrat  Published on  29 Nov 2022 2:00 PM GMT
రేపు అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

రేపు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్య‌టించ‌నున్నారు. అక్క‌డ జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి నాలుగో త్రైమాసిక నిధులను సీఎం జ‌గ‌న్‌ విడుదల చేయనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు మదనపల్లె బీటీ కాలేజ్‌ గ్రౌండ్స్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి టిప్పు సుల్తాన్‌ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి నాలుగో త్రైమాసిక నిధులను విడుదల చేయనున్నారు. కార్యక్రమం అనంతరం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


Next Story