రేపు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ ప‌ర్య‌ట‌న‌

CM Jagan Visit For Prakasham District Tomorrow. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి రేపు ప్రకాశం జిల్లా దర్శిలో పర్యటించనున్నారు.

By Medi Samrat
Published on : 19 Dec 2022 4:45 PM IST

రేపు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ ప‌ర్య‌ట‌న‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి రేపు ప్రకాశం జిల్లా దర్శిలో పర్యటించనున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌కు హాజరుకాబోతున్నారు. 20వ తేదీన ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు దర్శి చేరుకోనున్నారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు.. వధూవరులను ఆశీర్వదించి తిరుగు ప్రయాణం అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన ఖరారు కావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి రవాణాశాఖ అధికారులు సీఎం పర్యటించే కాన్వాయ్‌కి సంబంధించి కార్లు సమకూర్చారు.




Next Story