నేడు కొవ్వూరుకు సీఎం
CM Jagan to Visit Kovvuru Today. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నాడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు.
By Medi Samrat
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నాడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. ఆయన జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తారు. ఉ. 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కొవ్వూరు చేరుకుంటారు. సత్యవతినగర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమచేస్తారు. అనంతరం కొవ్వూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
జనవరి - మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ.703 కోట్లను నేడు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులను వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. జగనన్న విద్యాదీవెన పథకం కింద ఇప్పటి వరకు 26,98,728 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10,636.67 కోట్ల ఆర్థిక సాయం జమ చేసినట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది.