23న‌ సీఎం జగన్‌ తిరుపతి జిల్లా పర్యటన

CM Jagan To Visit In Tirupati District On 23rd. ఏపీ ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ 23వ తేదీ తిరుప‌తి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు.

By Medi Samrat  Published on  21 Jun 2022 6:14 PM IST
23న‌ సీఎం జగన్‌ తిరుపతి జిల్లా పర్యటన

ఏపీ ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ 23వ తేదీ తిరుప‌తి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. షెడ్యూల్ చేయ‌బ‌డిన ప‌ర్య‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. గురువారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. 11 గంటలకు తిరుపతి రూరల్‌ మండలం పేరూరు చేరుకుంటారు. అక్క‌డ‌ 11.15 – 11.45 గంటల వరకు శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.

అనంతరం 12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు చేరుకుని హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్‌ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ 1 పరిధిలోని టీసీఎల్‌ పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
















Next Story