రేపు, ఎల్లుండి సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

CM Jagan to visit Delhi For Two Days. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రేపు, ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on  29 Jan 2023 4:16 PM IST
రేపు, ఎల్లుండి సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రేపు, ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్ల‌నున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 6.45 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. 1 జన్‌పథ్‌ నివాసంలో రాత్రికి బసచేస్తారు. మంగళవారం ఉదయం 10.30 నుంచి 5.30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్‌ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం – కర్టెన్‌రైజర్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 6.05 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 8.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


Next Story