రేపు తిరుమలకు సీఎం వైఎస్ జగన్
CM Jagan Tirumala Visit. సీఎం వైఎస్ జగన్ రేపు మధ్యాహ్నం తిరుమల వెళ్ళనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు
By Medi Samrat Published on 10 Oct 2021 12:59 PM GMTసీఎం వైఎస్ జగన్ రేపు మధ్యాహ్నం తిరుమల వెళ్ళనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. 3 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి బర్డ్ హాస్పిటల్ చేరుకుంటారు. అక్కడ చిన్నపిల్లల గుండె జబ్బు చికిత్స ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అక్కడి నుండి అలిపిరి చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడకదారి, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.
12వ తేదీ ఉదయం 5.30 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకుని గొల్ల మండపాన్ని సందర్శిస్తారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ కన్నడ, హిందీ చానళ్ళను ప్రారంభిస్తారు. అనంతరం కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించి అన్నమయ్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు సాధికార సంస్ధ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పద్మావతి అతిధి గృహానికి చేరుకుని, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తిరుగుపయనం, ఉదయం 11.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి.