100 ఏళ్ల తర్వాత సర్వే జరుగుతుంది.. ప్రతిష్టాత్మకంగా తీసుకోండి

CM Jagan Review Meeting On Jagananna Saswatha Bhu Hakku Bhu Raksha. వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్

By Medi Samrat  Published on  6 Jun 2022 3:17 PM IST
100 ఏళ్ల తర్వాత సర్వే జరుగుతుంది.. ప్రతిష్టాత్మకంగా తీసుకోండి

వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ సోమ‌వారం సమీక్ష నిర్వ‌హించారు. క్యాంప్‌ కార్యాలయంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో అధికారులు సమగ్ర సర్వే వివరాలను సీఎంకు వివరించారు. ఇప్పటివరకూ జరిగిన సర్వే ప్రగతిని సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సమగ్ర సర్వే కారణంగా అన్ని భూ వివాదాలు పరిష్కారం అవుతాయని అన్నారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

భూ వివాదాలను పరిష్కరించడం అన్నది సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని సీఎం జ‌గ‌న్ తెలిపారు. సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోండ‌ని అధికారుల‌ను ఆదేశించారు. అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలని, సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణంగా తెప్పించుకోవాలని సీఎం ఆదేశించారు. డ్రోన్లు, ఓఆర్‌ఐ పరికరాలు, రోవర్లు, అలాగే సర్వే రాళ్లు సమకూర్చుకోవడం.. ఇలా ప్రతి అంశంలోనూ వేగం ఉండాలని చెప్పారు.

సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. 100 ఏళ్ల తర్వాత సర్వే జరుగుతోందని, ఈ సర్వేను పూర్తిచేయడం ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని సీఎం జ‌గ‌న్ అన్నారు.














Next Story