ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్

CM Jagan reached Delhi. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు.

By Medi Samrat
Published on : 26 May 2023 7:00 PM IST

ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. నేడు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ సమావేశం అవుతారు. రేపు నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఎల్లుండి కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.

మూడు రోజుల పాటు సీఎం జగన్ ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు నీతి ఆయోగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఎల్లుండి నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకకు హాజరవుతారు. తన పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. 28వ తేదీ సాయంత్రం ఆయన మళ్లీ ఏపీకి తిరుగుపయనమవుతారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంటు భవన సముదాయం ప్రారంభోత్సవం జరగనుంది. ఏపీ నుంచి వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు హాజరవుతున్నాయి.


Next Story