సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన ఖరారు

CM Jagan Nellore Visit. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.

By Medi Samrat
Published on : 25 Oct 2022 6:11 PM IST

సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌ మూడో యూనిట్‌ (800 మెగావాట్లు)‌ను సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు.

జగన్ గురువారం ఉదయం 9:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి, 10:55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 11:10 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 గంటల వరకు నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌ మూడో యూనిట్‌ (800 మెగావాట్లు)ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తిరిగి 3:30 గంటలకు తాడేపల్లి నివాసానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేరుకోనున్నారు.

Next Story