గ‌వ‌ర్న‌ర్ బిశ్వభూషణ్‌ ను క‌లిసిన సీఎం జ‌గ‌న్ దంప‌తులు

CM Jagan Meets Governor Harichandan. చత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా బదిలీ అయిన నేపధ్యంలో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

By Medi Samrat  Published on  13 Feb 2023 5:55 PM IST
గ‌వ‌ర్న‌ర్ బిశ్వభూషణ్‌ ను క‌లిసిన సీఎం జ‌గ‌న్ దంప‌తులు

చత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా బదిలీ అయిన నేపధ్యంలో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులను సీఎం వైయస్ జగన్, భారతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు గవర్నర్లను మారుస్తూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. కొత్తగా 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌ఘడ్ కు గవర్నర్‌గా బ‌దిలీ చేశారు.

ఇదిలావుంటే.. గవర్నర్‌గా బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ రాష్ట్రానికి అందించిన సేవలను సీఎం జ‌గ‌న్‌ కొనియాడారు. రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఆయన్ని గుర్తుంచుకుంటారని అన్నారు. మచ్చలేని వ్యక్తిత్వం హరిచందన్‌ సొంతమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితులను దాటుకుని రాష్ట్రం ప్రగతి పథంలో పయనించడానికి మరువలేని సహకారాన్ని అందించారన్నారు. అధికార కార్యకాలాపాల నిర్వహణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా, నిండైన హుందాతనంతొ వ్యవహరించారని, అత్యుత్తమ రాజకీయ పరిణితి చూపించారన్నారు. రాష్ట్రం- కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంలో, వాటి సంబంధాలు సజావుగాసాగడంలో అత్యంత కీలకపాత్రపోషించి, రాజ్యాంగానికి వన్నెతెచ్చారన్నారు. దేశంలో మరో రాష్ట్రానికి ఆయన గవర్నర్‌గా వెళ్లడం అక్కడి ప్రజలకు తప్పకుండా మేలుచేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.


Next Story