స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం
CM Jagan Launched Swechha. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు
By Medi Samrat Published on 5 Oct 2021 4:13 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రూపొందించిన 'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు ఆరోగ్యం, పరిశుభ్రతే 'స్వేచ్ఛ' కార్యకమ్ర లక్ష్యమని తెలిపారు. రుతుక్రమ సమస్యలతో చదువులు ఆగిపోతున్నాయని, 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు అందజేస్తామని తెలిపారు. 10లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాపికిన్లు పంపిణీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10, 388 స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ న్యాప్‌కిన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి నెల జేసీ (ఆసరా) ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరగాలని అన్నారు. మహిళా టీచర్లు, ఏఎన్‌ఎంలు బాలికలకు అవగాహన కల్పించాలని, 'స్వేచ్ఛ' పథకం అమలుపై నోడల్ అధికారిగా మహిళా టీచర్‌ను నియమించామని తెలిపారు.
బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతలో భాగమే స్వేచ్ఛ కార్యక్రమమని చెప్పారు. దేవుడి సృష్టిలో భాగమైన రుతుక్రమంలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాల గురించి మాట్లాడుకోవడం తప్పు అనే పరిస్థితి మారాలన్నారు. అలాంటి సమస్యలపై బాలికలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వేసవి సెలవులొస్తే స్కూల్ లో ఒకేసారి అందజేస్తారని చెప్పారు. దేశంలో 23 శాతం మంది బాలికల చదువులు ఆగిపోవడానికి కారణం.. రుతుక్రమ సమయంలో ఎదురవుతున్న సమస్యలేనంటూ యూఎన్ వాటర్ సప్లై, శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదికలో స్పష్టమైందని, వాటిని మార్చేందుకే 'స్వేచ్ఛ'ను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. దిశ యాప్, దిశ చట్టం గురించి వివరించాలని అన్నారు.