హెల్త్ హబ్‌ల ఏర్పాటుపై.. సీఎం జగన్ సంచలన నిర్ణయం
CM Jagan Key Decision On Health Hubs. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారం, మందులు, ఆక్సిజన్ సరఫరా కర్ఫ్యూ పొడిగింపు తదితర అంశాలపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో చర్చించారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని చేయాల్సిన ప్రయత్నాలపై కూడా జగన్ చర్చించారు. సరిహద్దుల వద్ద అంబులెన్స్ లను ఆపేసిన విషయం ఏపీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని.. అందుకోసం కొత్త పాలసీని తీసుకుని రావాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైద్యం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు ఎందుకు వెళ్ళాల్సి వస్తుందో ఆలోచించాలని.. రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి సహా 16 చోట్ల హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒక్కోచోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలి అన్నారు. అలాంటప్పుడు ఎవరూ మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. హెల్త్ హబ్ లు కోసం ఒక్కో ఆస్పత్రికి ఐదు ఎకరాలు కేటాయించాలని అన్నారు. రాబోయే మూడేళ్లలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే ఆస్పత్రులకు ఈ భూములు ఇవ్వాలని అన్నారు. అలా చేస్తే 80కి పైగా మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయన్నారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు వస్తున్నాయని.. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో ప్రైవేట్ రంగంలో కూడా మంచి ఆస్పత్రులు వస్తాయన్నారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పాలసీతో ప్రతి జిల్లా కేంద్రం, కార్పొరేషన్‌లలో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.