నేడు ఢిల్లీకి సీఎం జ‌గ‌న్

సీఎం జగన్ గురువారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

By Medi Samrat  Published on  8 Feb 2024 3:12 PM IST
నేడు ఢిల్లీకి సీఎం జ‌గ‌న్

సీఎం జగన్ గురువారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. సాయంత్రం 5 గంటలకు సీఎం జ‌గ‌న్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. రాత్రికి 1 జన్‌పథ్‌ నివాసంలో బస చేస్తారు.

ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జ‌గ‌న్‌ సమావేశం కానున్నారని తెలుస్తుంది. ఇతర కేబినెట్‌ మంత్రులను కూడా సీఎం జగన్‌ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భేటీలో భాగంగా రాష్ట్ర అభివృద్ధి అంశాలు, పోలవరం నిర్మాణం, రాష్ట్ర లోటు బడ్జెట్‌, వెనుకబడిన జిల్లాలు, వైద్య కాలేజీలు సహా పలు అంశాలపై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్రంలోని పెద్దలను కోర‌నున్న‌ట్లు స‌మాచారం.

Next Story