పులివెందులలో పూర్తైన‌ 10 రకాల నిర్మాణాలకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు

CM Jagan inaugurated 10 types of constructions completed in Pulivendula. పులివెందుల పట్టణ పరిధిలో మొత్తం రూ.124.10 కోట్ల వ్యయంతో చేపట్టి, నిర్మాణ, అభివృద్ధి పనులు

By Medi Samrat  Published on  24 Dec 2022 12:57 PM GMT
పులివెందులలో పూర్తైన‌ 10 రకాల నిర్మాణాలకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు

పులివెందుల పట్టణ పరిధిలో మొత్తం రూ.124.10 కోట్ల వ్యయంతో చేపట్టి, నిర్మాణ, అభివృద్ధి పనులు. పూర్తయిన 10 రకాల నిర్మాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభోత్సవాలు చేశారు. అందుకు సంబంధించిన వివరాలు.

1.పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ లో భాగంగా.. రూ.65.00 లక్షలతో అభివృద్ధి, సుందరీకరణ గావించిన ఆరోగ్య పథం (విజయ హోమ్ జంక్షన్)కు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు.

2.పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ లో భాగంగా.. రూ.75.00 లక్షలతో అభివృద్ధి, సుందరీకరణ గావించిన ప్రజా పథం (కదిరి జంక్షన్) ప్రారంభోత్సవం.

3.పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ లో భాగంగా.. రూ. 676.00 లక్షల వ్యయంతో 100 అడుగులకు విస్తరించి అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్న కదిరి రోడ్డు ప్రారంభోత్సవం.

4.పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ లో భాగంగా.. రూ.120.00 లక్షలతో అభివృద్ధి చేసిన కూరగాయల మార్కెట్.

5.రూ. 429.50 లక్షల పాడా నిధులతో అభివృద్ధి చేసిన పులివెందులలోని డా. వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్, మైత్రి లే అవుట్ ల ప్రారంభోత్సవం.

6.పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ లో భాగంగా.. రూ.870.00 లక్షలతో రాయలాపురం వద్ద నిర్మించిన నాలుగు లేన్ల బ్రిడ్జికి ప్రారంభోత్సవం.

7.రూ.22.40 కోట్ల పాడా నిధులతో ఆధునాతనంగా నిర్మించిన పులివెందుల ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండు ప్రారంభం.

8.పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ లో భాగంగా.. రూ.14.60 కోట్లతో నిర్మించిన.. అహోబిలం (మెయిన్) నూతన మోడల్ ప్రభుత్వ హై స్కూలు ప్రారంభోత్సవం.

అందులో భాగంగానే.. రూ. 225.00 లక్షల సి.ఎస్.ఆర్. నిధులతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి, అభివృద్ధి చేసిన ప్లే గ్రౌండ్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

9.రూ.50.00 కోట్ల ఎంఏ, యుడి నిధులతో రోటరీపురం వద్ద నిర్మించిన 10 ఎం.ఎల్.డి. ఎస్.టి.పి. ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

10.పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ లో భాగంగా.. రూ.12.50 కోట్లతో పూర్తి యాంత్రీకరణతో నడిచే గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కు ప్రారంభోత్సవం.

ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజద్ భాష, జిల్లా ఇంఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ మాలికార్జున్ రెడ్డి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జేసి సాయికాంత్ వర్మ, ఎస్పి కేకేఎన్ అన్బురాజన్, పాడా ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story