మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్‌

CM Jagan has shown his humanity. కడప పర్యటనలో ఉన్న‌ సీఎంని భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు కలిసి

By Medi Samrat  Published on  23 Dec 2022 6:27 PM IST
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్‌

కడప పర్యటనలో ఉన్న‌ సీఎంని భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు కలిసి తమ కుమారుడి అనారోగ్య సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన సీఎం, ప్రభుత్వం తరపున సహాయం చేస్తానని హామీ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు వెంటనే రూ. 1 లక్ష ఆర్ధిక సాయం అందించనున్నారు.

భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు, తను కడపలో రోజూ కూలీపనికి వెళుతూ జీవనం సాగిస్తున్నాడు. తన కుమారుడు నరసింహ (12 సంవత్సరాలు) నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ ఇబ్బందిని ముఖ్యమంత్రికి చెప్పుకున్నారు. వెంటనే స్పందించిన సీఎం నరసింహ కుటుంబానికి వెంటనే రూ. 1 లక్ష ఆర్ధిక సాయం చేయాలని, అంతేకాక ఆ బాలుడి వ్యాధికి మెరుగైన చికిత్సకు ఎంత ఖర్చు అయినా, ఎక్కడైనా సరే చేయించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేసింది. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు.


Next Story