ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలవనున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటుపై సహకరించాలని హోం మంత్రి అమిత్‌షాను కోరే అవకాశం ఉంది. అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలిసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ పర్యటనలో సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం.
పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో జగన్ చర్చించనున్నారని తెలుస్తోంది. కొవిడ్ దృష్ట్యా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయం చేయాలని జగన్ కోరుతున్న నేపథ్యంలో.. తాజా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల కిందటే జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉండేది. కానీ కేంద్రమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకపోవడంతో ఆ పర్యటన రద్దైంది. అందుకే రేపు జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.