ఇంధన శాఖకు సీఎం జగన్ అభినందన‌లు

CM Jagan congratulates Energy Department. ఏపీ ఇంధన శాఖ జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు గెలుచుకోవడంపై మంత్రి, అధికారులను

By Medi Samrat  Published on  16 Dec 2022 8:00 PM IST
ఇంధన శాఖకు సీఎం జగన్ అభినందన‌లు

ఏపీ ఇంధన శాఖ జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు గెలుచుకోవడంపై మంత్రి, అధికారులను సీఎం వైఎస్‌ జగన్ శుక్ర‌వారం అభినందించారు. ఇంధన పొదుపు, సంరక్షణలో జాతీయ స్ధాయిలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. ఇంధన భద్రత దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి కేంద్రం ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డుకు ఏపీని ఎంపిక చేసింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ శాఖ మంత్రి, అధికారులు అవార్డును అందుకున్నారు.

నేడు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను క‌లిసిన ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్, ఆంధ్రప్రదేశ్‌ ఇంధన పరిరక్షణ మిషన్‌ సీఈవో ఏ.చంద్రశేఖర్‌ రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృద్వితేజ్ అవార్డును ఆయ‌న‌కు చూపించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి, అధికారులను సీఎం అభినందించారు.


Next Story