ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. ఇక టీ గ్లాస్

రాప్తాడు వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు

By Medi Samrat  Published on  18 Feb 2024 11:16 AM GMT
ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. ఇక టీ గ్లాస్

రాప్తాడు వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలని అన్నారు. ఇక టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలని అన్నారు. ఇప్పుడు జరుగుతోంది రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమని అన్నారు వైఎస్ జగన్. సీమకు సముద్రం లేకపోవచ్చు కానీ .. నేడు అనంతపురం జిల్లా రాప్తాడు లో జన సముద్రం చూడొచ్చన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదు.. ఎగ్గొట్టేవాడు.. రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అంటాడు. మానిఫెస్టో మాయం చేసి .. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తాను అంటాడు. చుక్కల్ని దింపుతా అంటాడని సీఎం జగన్‌ విమర్శలు చేశారు.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. ఇన్నేళ్లు పరిపాలన చేశారు చంద్రబాబు.. ఆయన పేరు చెబితే రైతులకు గర్తు వచ్చే పథకం ఏదైనా ఉందా? చంద్రబాబు పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తుకు వచ్చే ఒక్క విషయమైనా ఉందా? విద్యార్థులకైనా గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా? చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క మంచిపని అయినా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం తెచ్చిన ఒక్క స్కీమ్ అయినా ఉందా?’ అని జగన్ ప్రశ్నించారు.

Next Story