చిన్నారి హనీని ఆశీర్వదించిన సీఎం జ‌గ‌న్‌

CM Jagan blessed baby Honey. సీఎం వైఎస్‌ జగన్‌ను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు

By Medi Samrat  Published on  11 Jan 2023 4:25 PM IST
చిన్నారి హనీని ఆశీర్వదించిన సీఎం జ‌గ‌న్‌

సీఎం వైఎస్‌ జగన్‌ను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు క్యాంపు కార్యాలయంలో బుధ‌వారం క‌లిశారు. గతంలో కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న క్ర‌మంలో సీఎం జ‌గ‌న్‌ను.. అరుదైన గాకర్స్‌ వ్యాధితో బాధపడుతున్న‌ చిన్నారి హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు చికిత్సకు సాయం కోసం క‌లిశారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ స‌మ‌స్య‌ను తెలుసుకున్న సీఎం.. వెంట‌నే వైద్యం కోసం రూ.1 కోటి మంజూరు చేశారు. చిన్నారి హనీ చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లతో పాటు.. నెలకు రూ.10 వేలు పెన్షన్‌ కూడా అందిస్తుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలతో చిన్నారి హనీ చికిత్స పొందుతూ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంది. అయితే.. బుధ‌వారం హనీ పుట్టిన రోజు సందర్భంగా తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబు సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా చిన్నారి హనీ ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం.. అనంత‌రం ఆశీర్వదించారు.


Next Story