సీఎంతో కేక్ కట్ చేయించిన మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు
CM Jagan Birthday Celebrations. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో కేక్ కట్ చేయించారు మంత్రులు
By Medi Samrat Published on 21 Dec 2022 4:14 PM ISTసీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో కేక్ కట్ చేయించారు మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దంపతులు ఫోన్‌లో ముఖ్యమంత్రి జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు సీఎంకు వేంకటేశ్వరస్వామి ప్రసాదాలు అందించారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా పాస్టర్ జాన్ వెస్లీ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తానేటి వనిత, ఆర్ కె రోజా, విడదల రజిని, జోగి రమేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, బాలశౌరి, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ అజేయ కల్లాం, ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్ పి సిసోడియా, సమాచారశాఖ కమిషనర్ టి విజయకుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి, అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు, సంయుక్త కార్యదర్శి నారాయణ భరత్ గుప్తా, సీఎం ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ యిరగవరపు అవినాష్, సీఎం స్పెషల్ సెక్రటరీలు దువ్వూరి కృష్ణ, ఎం హరికృష్ణ, ముఖ్యమంత్రి సలహాదారులు ఆర్ ధనంజయ రెడ్డి, సీపీఆర్వో టు సీఎం పూడి శ్రీహరి, పలువులు ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.