గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడు (గోకరాజు రామరాజు కుమారుడు) వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం వైఎస్ జగన్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంగళగిరి సీకే కన్వెన్షన్స్‌లో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకకు హజరైన సీఎం జగన్ నూతన వధూవరులు సాయి సంజన, ఆదిత్య వర్మలను ఆశీర్వదించిచారు. గోకరాజు గంగరాజు 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన.. పారిశ్రామిక వేత్తగా గుర్తింపు పొందారు. బీసీసీఐ లో కూడా కీలక పదవిలో ఉన్నారు గోకరాజు గంగరాజు.