అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజ‌రైన సీఎం జ‌గ‌న్‌

CM Jagan attended Ali's daughter's wedding reception. సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు

By Medi Samrat
Published on : 29 Nov 2022 6:14 PM IST

అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజ‌రైన సీఎం జ‌గ‌న్‌

సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. గుంటూరు శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన వివాహా రిసెప్షన్‌ వేడుకలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. వధువు మహ్మమద్‌ ఫాతిమా రమీజున్, వరుడు షేక్‌ షహయాజ్‌లను ఆశీర్వదించారు.


ఇదిలావుంటే.. అలీ పెద్ద కుమార్తె ఫాతిమా రమీజున్ వివాహం సోమవారం రాత్రి హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వివాహ వేడుకకి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, కింగ్ నాగార్జున,అమల దంపతులు హాజరయ్యారు. అలానే మంత్రి రోజా కూడా అలీ కుమార్తె వివాహానికి హాజరై..వధువరులను ఆశీర్వదించారు. వీరితో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించారు. పెళ్లికి హాజరు కాని సీఎం జగన్.. రిసెప్షన్ వేడుకకు హాజ‌రై నూతన దంపతులను ఆశీర్వదించారు.


Next Story