ఆశా మాలవ్యకు సీఎం జ‌గ‌న్ అభినంద‌న‌లు.. రూ. 10 లక్షల న‌గ‌దు ప్రోత్సాహకం

Cm Jagan Announced A Cash Incentive Of 10 Lakh To Asha Malaviya. సైకిల్‌పై దేశాన్ని చుట్టివస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య సీఎం క్యాంప్‌ కార్యాలయం

By Medi Samrat  Published on  6 Feb 2023 9:41 AM GMT
ఆశా మాలవ్యకు సీఎం జ‌గ‌న్ అభినంద‌న‌లు.. రూ. 10 లక్షల న‌గ‌దు ప్రోత్సాహకం

సైకిల్‌పై దేశాన్ని చుట్టివస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ సంద‌ర్భంగా ఆశా మాలవ్యను ప్రత్యేకంగా అభినందించిన సీఎం వైఎస్‌ జగన్.. ఆమె ల‌క్ష్యం నెర‌వేరేందుకు రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్లు పూర్తయిందని ఆశా మాలవ్య సీఎంకి వివరించింది.

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌ జిల్లా నతారామ్‌ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య.. మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్‌యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ సంద‌ర్భంగా ఆశా మాలవ్య కృషిని సీఎం ప్రశంసించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూనం మాలకొండయ్య, ఇతర సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Next Story