ఏపీలో ఓటింగ్ ప్రారంభం అవ్వగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతీరెడ్డితో కలిసి కడప జిల్లా పులివెందులలోని భాకరాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ఉదయం 7.00 గంటలకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఓటు వేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు నారా లోకేష్, నారా బ్రాహ్మణి. ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు చంద్రబాబు కుటుంబ సభ్యులు. గాదె రామయ్య-సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో ఓటు వేశారు.