ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు శనివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పంచెకట్టులో ముఖ్యమంత్రి జగన్ ఉగాది వేడుకలకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి దంపతులకు తిరుమల తిరుపతి దేవస్ధానం పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం అందించారు. ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి దంపతులకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, సాంస్కృతిక, పర్యాటకశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్, ఇతర అధికారులు ఆహ్వానం పలికారు.
ఉగాది వేడుకల ప్రత్యేక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం వేదికపై పంచాంగ శ్రవణం పఠించారు. గ్రామీణ నేపధ్యం ఉట్టిపడేలా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుచేశారు. ఉగాది వేడుకలకు హాజరైన చిన్నారులను ముఖ్యమంత్రి దంపతులు ఆప్యాయంగా పలకరించారు. పంచాంగాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రభుత్వ ఆస్ధాన సిద్ధాంతి కప్పగంటి సుబ్బరామసోమయాజులకు అందజేశారు. అనంతరం వేదికపై కప్పగంటి సుబ్బరామసోమయాజులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉగాది వేడులను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.