15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించాం : సీఎం చంద్ర‌బాబు

కూటమి ప్రభుత్వం 15 నెలల పాలనలో ఉద్యోగాల కల్పనపై శాస‌న‌సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు.

By -  Medi Samrat
Published on : 26 Sept 2025 6:46 PM IST

15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించాం : సీఎం చంద్ర‌బాబు

కూటమి ప్రభుత్వం 15 నెలల పాలనలో ఉద్యోగాల కల్పనపై శాస‌న‌సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. 15 నెలల్లో అన్ని రంగాల్లో, అన్ని సెక్టార్లలో కలిపి మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి వివ‌రించారు. ఏయే రంగాల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చామనే విషయాన్ని సెక్టార్ల వారీగా అసెంబ్లీలో వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చామనే అంశాన్ని సీఎం వెల్లడించారు. మెగా డీఎస్సీ ద్వారా 15,941, వివిధ ప్రభుత్వ విభాగాల్లో 9,093, పోలీస్ శాఖలో 6,100 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు వెల్లడించారు.

అలాగే.. స్కిల్ డెవలప్మెంట్ - జాబ్ మేళాల ద్వారా 92,149 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. వర్క్ ఫ్రం హోం ద్వారా 5,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని.. ప్రైవేట్ రంగంలో మొత్తంగా 3,48,891 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రైవేట్ సెక్టార్‌లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ, ఎంఎంస్ఎంఈలు, పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో మొత్తం 3.48 లక్షల కల్పించామ‌ని.. ఎవరు ఎక్కడ, ఎప్పుడు ఉద్యోగం పొందారు, ఏ జాబ్ చేస్తున్నారు అనే సమస్త వివరాలను పోర్టల్ ద్వారా కూడా వెల్లడిస్తామని సీఎం ప్రకటించారు.

Next Story