గుడ్‌న్యూస్.. రాష్ట్రానికి రూ. 4,38,400 కోట్ల పెట్టబడులు.. భారీగా ఉద్యోగావకాశాలు
డిసెంబర్ 1 నుంచి నేను కూడా గేర్ మార్చుతా.. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని చరిత్ర సృష్టించాలని సీఎం చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 23 Nov 2024 6:39 AM ISTడిసెంబర్ 1 నుంచి నేను కూడా గేర్ మార్చుతా.. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని చరిత్ర సృష్టించాలని సీఎం చంద్రబాబు అన్నారు. టీమ్ లీడర్ గా ముందుండి నడిపిస్తా.. నేను ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా వస్తా.. ప్రజలకు మంచి చేస్తే వాళ్లే మళ్లీ గెలిపిస్తారన్నారు. నియోజకవర్గాలపై ఎమ్మెల్యేలకు కూడా బాధ్యత ఉంది. నియోజకవర్గాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. మీకు పూర్తిగా సహకరిస్తానని ఎమ్మెల్యేలతో అన్నారు. మనం తెచ్చిన 2047 విజన్ ను కూడా సాధ్యం చేస్తాం. రూ.9.74 లక్షల కోట్లు అప్పులు చేశారు. వాటికి వడ్డీలు కట్టాలి. ఆదాయం పెంచి ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉందన్నారు.
అభివృద్ధికి డబ్బులు ఖర్చు చేస్తేనే సంపద వస్తుంది. గత ఐదేళ్లూ మూడు ముక్కలాటలాడి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఐదేళ్ల సమయాన్ని వృధా చేశారన్నారు. పోలవరం పూర్తి చేసి ఉంటే వ్యవసాయం బాగా అభివృద్ధి జరిగేది రైతులు బాగుపడేవారు. రైతులకు కొనుగోలు శక్తి పెరిగితే ఆదాయం పెరిగేది. 2047 విజన్ ను త్వరలోనే ప్రారంభిస్తాం. మారిన పరిస్థితులకు అనుగుణంగా వెర్షన్ లు మారుతుంటాయి. విజన్ 5.0 తీసుకొస్తాం. అదానీ అంశంలో వాస్తవాలు బయటికొస్తే ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. ఈ అంశాన్ని ప్రస్తావించిడానికి కూడా ఇబ్బంది కరమైన పరిస్ధితి కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తాం. అమెరికా కోర్టులో వేసిన చార్జిషీట్ మా దగ్గర ఉంది. చార్జిషీట్ అధ్యయనం చేసి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
పబ్లిక్ పాలసీలు ప్రజల జీవితాలను మార్చుతాయన్నారు. ఇప్పటికే ఇసుక, లిక్కర్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలెప్మెంట్ పాలసీ, ఎపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంట్రపెన్యూర్సిప్ డెవలెప్మెంట్ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, టూరిజం పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, డ్రోన్ పాలసీ, న్యూ వాటర్ పాలసీ, స్కిల్ డెవలెప్మెంట్ పాలసీ, స్క్రాపింగ్ ఆఫ్ టు చైల్డ్ నార్స్మ్ పాలసీలను తెచ్చాం. ఈ పాలసీల ప్రభావం అప్పుడే కనబడుతోందన్నారు. ఏపీఐఐసీ ద్వారా భూమి కేటాయిస్తే రూ.3,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 9,573 మందికి ఉద్యోగాలు వస్తాయి. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ ను స్ట్రీమ్ లైన్ చేయడం ద్వారా రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు వచ్చి 30 వేల మందికి, ఎస్ఐపీబీ ద్వారా రూ.73 వేల కోట్ల పెట్టుబడులతో 27,891 మందికి, ఎస్ఐపీబీ ఎనర్జీ రంగంలో రూ.11,900 కోట్లతో 6,075 మంది, ఎన్టీపీసీ రూ.1,81,000 కోట్ల పెట్టుబడి ద్వారా 1,22,500 మందికి, ఎన్.హెచ్.పీసీ ద్వారా రూ.1 లక్ష కోట్లతో 7 వేల మందికి, రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ రూ.65 వేల కోట్ల ద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. మొత్తంగా ఇప్పటికి రూ. 4,38,400 కోట్ల పెట్టబడులకు ఒప్పందాలు జరిగాయి. తద్వారా 4,53,039 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.