పెన్షనర్ల ఇళ్లకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు

జులై నుంచి పెంచిన పెన్షన్లు ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఏప్రిల్ నుంచి పెరిగిన పెన్షన్ తో కలిపి జులై 1వ తేదీన రూ.7 వేల పెన్షన్ ఇవ్వనున్నారు.

By Medi Samrat  Published on  29 Jun 2024 7:45 PM IST
పెన్షనర్ల ఇళ్లకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు

జులై నుంచి పెంచిన పెన్షన్లు ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఏప్రిల్ నుంచి పెరిగిన పెన్షన్ తో కలిపి జులై 1వ తేదీన రూ.7 వేల పెన్షన్ ఇవ్వనున్నారు. సచివాలయ సిబ్బంది పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి రూ.7 వేలు అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో జులై 1వ తేదీన చంద్రబాబు పెన్షనర్ల ఇళ్లకు వెళ్లనున్నారు. పెంచిన పెన్షన్లను వారికి తన చేతుల మీదుగా అందించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెట్టారు. సీఎం చంద్రబాబు పెన్షన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని.. మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలను పెంచి ఇస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగులకు పెన్షన్ రూ.6వేలు ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు.

Next Story