నేడు సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇదే..

శనివారం నాడు అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్‌లోని నేమకల్‌లో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ, గ్రామసభలో ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు.

By Kalasani Durgapraveen  Published on  30 Nov 2024 8:33 AM IST
నేడు సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇదే..

శనివారం నాడు అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్‌లోని నేమకల్‌లో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ, గ్రామసభలో ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. నేమకల్‌కు వెళ్లే ముందు ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. గ్రామంలోని ఐదు శతాబ్దాల నాటి హనుమాన్ దేవాలయంలో పూజలు చేసి గ్రామస్తులతో మాట్లాడనున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కోరినట్లు తుంగభద్ర హైలెవల్ కెనాల్ నుంచి నీటిని నిల్వ చేసేందుకు నేమకల్ వద్ద రిజర్వాయర్ నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

శుక్రవారం నేమకల్‌, పరిసర ప్రాంతాల్లో సీఎం పర్యటన నేపథ్యంలో అనంతపురం ఎస్పీ పి.జగదీష్‌ నేతృత్వంలో పోలీసులు డ్రోన్‌లను ఉపయోగించి తనిఖీలు నిర్వహించారు.

Next Story