విజయనగరం కాదు.. అనకాపల్లికి మారింది..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు

By Kalasani Durgapraveen  Published on  2 Nov 2024 10:47 AM IST
విజయనగరం కాదు.. అనకాపల్లికి మారింది..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పాల్గొనున్నారు. “ మిషన్ పాత్ హోల్ ఫ్రీ ఏపీ “ పేరిట రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు చేపట్టనుంది. సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారుల రాష్ట్రంగా ఏపీని తీర్చదిద్దడమే లక్ష్యంగా మిషన్ మోడ్ లో ప్రభుత్వం పనిచేయనుంది. తొలుత విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమంను ఏర్పాటు చేసినప్పటికీ.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు కార్యక్రమం మారింది.


Next Story