రేపటి సీఎం చంద్రబాబు విశాఖ టూర్ రద్దు

రేపు ఉదయం విశాఖలో నిర్వహిస్తున్న న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్ షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది.

By Medi Samrat
Published on : 12 Jun 2025 9:21 PM IST

రేపటి సీఎం చంద్రబాబు విశాఖ టూర్ రద్దు

రేపు ఉదయం విశాఖలో నిర్వహిస్తున్న న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్ షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ కార్యక్రమం రద్దు అయింది. అలాగే ప్రమాదం కారణంగా రేపటికి వాయిదా పడిన 'సుపరిపాలనలో తొలి అడుగు' పేరిట నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం కూడా రద్దు అయింది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఘోర దుర్ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈరోజు సాయంత్రం తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కార్యక్రమం ఎప్పుడు నిర్వ‌హించ‌నున్నారో త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు.

Next Story