ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన మొదటి పర్యటనలో భాగంగా సోమవారం పోలవరం వెళ్లనున్నారు. ప్రాజెక్టును సందర్శించి, జలవనరులశాఖ అధికారులతో సమీక్షించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అందుకే సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు.
సోమవారం-పోలవరం కార్యక్రమంలో భాగంగా జూన్ 17న పోలవరం ఆనకట్ట ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అధికారులు సిద్ధం చేసిన అధికారిక ప్రోటోకాల్ ప్రకారం, చంద్రబాబు నాయుడు పోలవరాన్ని పరిశీలించడానికి 7 గంటల సమయాన్ని వెచ్చించనున్నారు. తనిఖీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. అక్కడికి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.