ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, సెక్రటరీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు సమావేశం కానున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 02.00 గంటల వరకు సచివాలయంలో వారితో సమావేశం అవుతారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు వర్చువల్‌గా హాజరుకానున్నారు. జీఎస్డీపీ, 2047 విజన్‌లోని 10 సూత్రాలపై సంబంధిత అధికారులు సమావేశంలో ప్రజంటేషన్ ఇస్తారు.
అనంతరం ఆదాయార్జన, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ విధానంలో ప్రాజెక్టులు, పెట్టుబడులు, దస్త్రాల పరిష్కారం, ఆన్‌లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై సీఎం సమీక్షిస్తారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, సర్వే, ఫిర్యాదుల పరిష్కారం, రిజిస్ట్రేషన్ సేవలు, బ్లాక్ చైన్ విధానంతో ప్రజల ఆస్తులకు రక్షణ వంటి వాటిపై అధికారులు, మంత్రులకు దిశానిర్దేశం చేస్తారు. అదే విధంగా ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వీబీ-జీ-రామ్ జీ పైనా మంత్రులు, అధికారులతో సీఎం చర్చిస్తారు. సమావేశం అనంతరం సాయంత్రం సంక్రాంతి పండుగకు తన స్వగ్రామం నారావారిపల్లెకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు.