ఏపీ ఐటీ చరిత్రలో చారిత్రక ఘట్టం..ఈ నెల 14న దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్లు ప్రారంభం!
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మరో అద్భుత మైలురాయిని అధిగమించబోతోంది.
By - Knakam Karthik |
ఏపీ ఐటీ చరిత్రలో చారిత్రక ఘట్టం..ఈ నెల 14న దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్లు ప్రారంభం!
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మరో అద్భుత మైలురాయిని అధిగమించబోతోంది. ఏప్రిల్ 14న ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ, ఓపెన్-యాక్సెస్ క్వాంటం కంప్యూటర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఎస్ఆర్‌ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 'అమరావతి 1S', 'అమరావతి 1Q' క్వాంటం కంప్యూటర్లను ముఖ్యమంత్రి జాతికి అంకితం చేస్తారని ఆయన తెలిపారు.
అమరావతిని ప్రపంచస్థాయి 'క్వాంటం వ్యాలీ'గా మార్చాలనే ప్రభుత్వ సంకల్పంలో ఇది మొదటి అడుగు అని లోకేశ్ పేర్కొన్నారు. పూర్తిగా భారత్‌లోనే తయారై, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడం గర్వకారణమని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్ టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ వేదికగా మారుతుందని, గ్లోబల్ క్వాంటం కంప్యూటింగ్ మ్యాప్‌లో అమరావతికి ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ క్వాంటం విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహించే దిశగా ఈ ముందడుగు పడుతోంది.
#QuantumCapitalAmaravati From vision to qubits - #AndhraPradesh is building India’s quantum future. On April 14 (World Quantum Day), our Chief Minister @ncbn garu will inaugurate India’s first indigenous, open-access quantum computers - #Amaravati 1S & 1Q - at SRM University,… pic.twitter.com/15mql75fxS
— Lokesh Nara (@naralokesh) April 12, 2026