రాష్ట్రంలో భారీ వర్షాలు..దుబాయ్ నుంచి అధికారులతో మాట్లాడిన సీఎం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు.

By -  Knakam Karthik
Published on : 23 Oct 2025 11:59 AM IST

Andrapradesh, Heavy Rains, Rail Alert, Cm Chandrababu,

రాష్ట్రంలో భారీ వర్షాలు..దుబాయ్ నుంచి అధికారులతో మాట్లాడిన సీఎం

అమరావతి: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై మంత్రులు, సీఎస్, ఆర్టీజీ అధికారులతో సీఎం మాట్లాడారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

ఇక ప్రాణ, ఆస్తి నష్టం జరగ్గకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. అటు రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోనీ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో ఇప్పటికే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్టు సీఎంకు అధికారులు వివరించారు. కాలువ, చెరువు గట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్ట పరచాలని సీఎం సూచనలు చేశారు. అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

Next Story